Shanti Kumari : ఈ నెల 9 నుండి అసలు సర్వే మొదలవుతుంది : సీఎస్ శాంతికుమారి

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(Comprehensive Family Survey)ను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari)ఆదేశించారు

Update: 2024-11-07 14:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే(Comprehensive Family Survey)ను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్త శుద్దితో కృషిచేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari)ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై గురువారం ప్రత్యేకాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఈ సర్వే కు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ రేపటితో పూర్తవుతుందని, ఈ నెల 9 నుండి అసలు సర్వే మొదలవుతుందని అన్నారు. దేశంలోనే ప్రధమంగా చేపట్టిన ఈ ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియని రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.

ఈ సర్వేలో ప్రతీ ఒక్క కుటుంబం పాల్గొనేలా ప్రతీ రోజూ ప్రజలను చైతన్య పర్చేలా విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు. ఏ ఇంటిని కూడా వదలకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు, జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. సేకరించిన వివరాలను కంప్యూటరైజ్ చేయడానికి సుశిక్షితులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించేల చర్యలు చేపట్టాలని సూచించారు. 

Tags:    

Similar News