ఆ బాధ్యత CM రేవంత్ రెడ్డిదే.. తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2025-03-16 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రాళ్లతో కొడతానని మాట్లాడారు.. ప్రభుత్వాన్ని కూలుస్తామని కడియం శ్రీహరి చెప్పారు.. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద పాల్గొనబోతున్నారు. ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుపై గౌరవం ఉంటే.. తక్షణమే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియంతో రాజీనామా చేయిస్తారో.. లేక ప్రజలకు క్షమాపణ చెబుతారో సీఎం రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని అన్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు నిర్బంధిస్తున్నారు.. ఇక రేవంత్ రెడ్డి పర్యటనను ప్రజలే అడ్డుకుంటారని తెలిపారు.

మరోవైపు.. నేడు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం(Station Ghanpur Constituency)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News