బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయనున్నట్లు పార్టీ నేతలతో స్పష్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన (State wide tour) చేయనున్నట్లు పార్టీ నేతలతో స్పష్టం చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకi ముందు పార్టీ శ్రేణులతో మాట్లాడిన కేటీఆర్.. ఈ నిర్ణయాన్ని తెలిపినట్లు తెలుస్తుంది. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ (BRS Party Silver Jubilee) సంబరాల (Celebrations) విజయానికి పార్టీ నేతలకు ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు (Assembly meetings) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే రాష్ట్రవ్యాప్తం (State wide)గా అన్ని జిల్లాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ జిల్లాల పర్యటన ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే దానిపై క్లారిటీ రాలేదు. అసెంబ్లీ సమావేశాల అనంతరం కేటీఆర్ జిల్లాల పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.