Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వాయిదా
తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) శుక్రవారానికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 11:14 గంటలకు శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ (Budget 2025-26) ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ప్రకటించారు. తిరిగి శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. మరో వైపు శాసన మండలి సైతం శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ స్పీచ్ పూర్తయిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్లు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రకటించారు.