ఎల్​ఆర్​ఎస్​ అమలులో పురోగతి సాధించాలి : దానకిషోర్

ఎల్​ఆర్​ఎస్​ (లేఅవుట్​ రెగ్యులరైజేషన్​ స్కీం) దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేకదృష్టి సారించి ఈ నెల 31 వ తేదీలోగా ఎల్​ఆర్​ఎస్​ అమలులో నూరు శాతం పురోగతి సాధించాలనీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.

Update: 2025-03-21 17:31 GMT
ఎల్​ఆర్​ఎస్​ అమలులో  పురోగతి సాధించాలి : దానకిషోర్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్​ఆర్​ఎస్​ (లేఅవుట్​ రెగ్యులరైజేషన్​ స్కీం) దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేకదృష్టి సారించి ఈ నెల 31 వ తేదీలోగా ఎల్​ఆర్​ఎస్​ అమలులో నూరు శాతం పురోగతి సాధించాలనీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. తప్పిదాలకు తావు లేకుండా ఎల్​ఆర్​ఎస్​ ప్రక్రియను మార్చి నెెలలోగా పూర్తిచేయాలన్నారు. దరఖాస్తుదారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. హైదరాబాద్ నుండి శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ ఎల్ఆర్ఎస్ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎల్​ఆర్​ఎస్​ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు సంబంధించి ప్రొసీడింగ్ జనరేట్ చేసి అందజేయాలన్నారు.

ఇప్పటికీ ఫీజు చెల్లించని దరఖాస్తుదారులు రెండో దఫా ఫోన్ చేసి మార్చి 31 లోగా ఫీజులు చెల్లించేలా చూడాలనీ చెప్పారు. ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ లు సంబంధిత మున్సిపల్ కమిషనర్ లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించాలాన్నారు. ఎల్​ఆర్​ఎస్​ వల్ల కలిగే ప్రయోజనాలను దరఖాస్తుదారులకు తెలిసేలా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు. ఈ నెల 24 వ తేదీన మరోసారి ఎల్​ఆర్​ఎస్​ పై జిల్లా కలెక్టర్ లు , కమిషనర్ లతో సమీక్ష నిర్వహిస్తానని ముఖ్య కార్యదర్శి చెప్పారు.

Tags:    

Similar News