హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫీవర్‌.. ఉప్పల్ పరిసరాల్లో కోలాహలం

హైదరాబాద్(Hyderabad) మహా నగరంలో ఐపీఎల్ ఫీవర్(IPL Fever) మొదలైపోయింది.

Update: 2025-03-23 07:48 GMT
హైదరాబాద్‌లో ఐపీఎల్‌ ఫీవర్‌.. ఉప్పల్ పరిసరాల్లో కోలాహలం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) మహా నగరంలో ఐపీఎల్ ఫీవర్(IPL Fever) మొదలైపోయింది. కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య ఉప్పల్ మైదానం వేదికగా మ్యాచ్ జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ క్రేజ్‌ను బ్లాక్ టికెట్లు అమ్మే ముఠా క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా ఐపీఎల్ బ్లాక్ టికెట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొని బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను గుర్తించారు. మొత్తం పదకొండు మందిని ఎస్‌వోటీ పోలీసులు(SOT Police) ఆదివారం అరెస్ట్ చేశారు.

మరోవైపు కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఉప్పల్(Uppal Ground) పరిసన ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి వందల సంఖ్యలో అభిమానులు మైదానం వద్దకు చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్‌లో ఫైనల్స్‌కు చేరిన ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌(SRH Fans)ను నిరాశపర్చింది. టోర్నీ మొత్తం అదరగొట్టిన హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం తడబడింది. ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

Tags:    

Similar News