IPL 2025: ఇవాళ రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్.. బలాబలాలు ఇవే !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవ్వాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవ్వాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగబోతోంది. బర్సపారా క్రికెట్ స్టేడియంలో (Barsapara Cricket Stadium, Guwahati) రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ఉండగా... 7:30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య మ్యాచ్ వీక్షించవచ్చు.
రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ రికార్డులు
రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ జట్ల ( RR VS KKR ) మధ్య ఇప్పటివరకు 30 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్ ల్లో రాజస్థాన్ విజయం సాధిస్తే, మరో 14 మ్యాచ్ ల్లో కేకేఆర్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అంటే రెండు జట్లు సమానంగా.... ప్రదర్శన కనబరిచాయి. మరో రెండు మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఇవాల్టి విన్నింగ్ ప్రాబబిలిటీ చూసుకున్నట్లయితే... రాజస్థాన్ రాయల్స్ కు 50% ఛాన్స్ ఉంటే కేకేఆర్ కు కూడా అదే 50% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాల్టి మ్యాచ్ లో... సంజు శాంసన్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రియాన్ పరాగ్ రాజస్థాన్ కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కానీ ఇవాళ సంజు మాత్రం కెప్టెన్ గా బరిలోకి దిగబోతున్నాడని సమాచారం.