Queen of the SUN Empire .. కావ్య పాప.!

అసలు క్రికెట్‌కు.. ‌‌‌కావ్యకు ఎక్కడ కుదిరింది.? ఐపీఎల్ ఫ్రాంచజర్‌గా ఆమె సక్సెస్ రేట్ ఎంత.?

Update: 2025-03-27 03:50 GMT
Queen of the SUN Empire .. కావ్య పాప.!
  • whatsapp icon

ఐపీఎల్..

ఆటగాళ్లకు పైసలు.

అభిమానులకు ఫన్‌డగ.

ఫ్రాంచైజర్లకు పండగ.

"ఎస్ఆర్‌హెచ్" మ్యాచ్ ఉన్నప్పుడు చూస్తుంటాం కదా..

కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్.

స్క్రీన్ మీద కావ్య కనిపిస్తే చాలు.. కేరింతలే కేరింతలు.

అంతగా యువతను ఆకట్టుకుంది కావ్య మారన్.

ఆమె అందగత్తె మాత్రమే కాదు.. అద్భుతమైన వ్యాపారవేత్త కూడా.

అసలు క్రికెట్‌కు.. ‌‌‌కావ్యకు ఎక్కడ కుదిరింది.?

ఐపీఎల్ ఫ్రాంచజర్‌గా ఆమె సక్సెస్ రేట్ ఎంత.?

లెట్స్ ఫాలో ద స్టోరీ.!!

- దిశ, ఫీచర్స్

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఆటగాళ్లంతా ఒక్కసారిగా కేరింతలు మొదలుపెట్టారు. "ఏమైంది.. సిక్స్ కొట్టాడా లేక వికెట్ పడిందా" అని అడిగితే "లేదు కావ్య పాప కనిపించింది" అన్నాడొకతను. వాళ్ల దృష్టిలో కావ్య పాప అంటే ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజర్ కావ్య మారన్. ఇంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆమె.

బిజినెస్ ఫ్యామిలీ

ఐపీఎల్ టోర్నీ "సన్ రైజర్స్ హైదరాబాద్" జట్టు ఓనర్ కావ్య మారన్ చెన్నైలో పుట్టింది. ఆమె వయసు జస్ట్ 32 ఇయర్స్. ప్రాథమిక విద్యను చెన్నయ్‌లోని డీఏవీ స్కూల్లో చదివింది. 2012లో స్టెల్లా మారిన్ కాలేజీ నుంచి బీకామ్ చేసింది. 2016లో యూకేలోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తిచేసింది. వ్యాపార నేపథ్యమున్న కుటుంబం కాబట్టీ ఎంబీఏ చదివించారు. ఎంబీఏ వ్యాపార నిర్వహణలో తోడ్పడింది. తండ్రి కళానిధి మారన్ ఇండియాలోని అతిపెద్ద మీడియా సంస్థలో ఒకటైన "సన్ గ్రూప్" స్థాపకుడు, చైర్మెన్. తల్లి కావేరీ మారన్. సన్ గ్రూప్ జాయింట్ ఎండీ. ఇండియాలో ఎక్కువ వేతనం పొందేవాళ్లలో కావేరీ ఒకరు.

క్రికెట్‌పై ఆసక్తి

కావ్య ఏకైక సంతానం కాబట్టీ ఆమెకు జీవితం విలువను బోధిస్తూ పెంచారు. తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని, తపనను అర్థం చేసుకున్న కావ్య చిన్నప్పటి నుంచే ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. "సన్ గ్రూప్‌"ను విజయవంతమైన మీడియా సామ్రాజ్యంగా మార్చిన కళానిధి.. వ్యాపార నైపుణ్యం కోసం బిజినెస్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేశాడు. క్రికెట్ పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తే తనను క్రీడా రంగం వైపు తీసకొచ్చింది. కావ్య ఫ్యామిలీకి వ్యాపార నేపథ్యం ఉంది. కావ్య వాళ్ల తాత ముసోలిని మారన్. మామ దయానిధి మారన్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి వీళ్ల నాన్న సొంత మేనల్లుడు. కావ్య ప్రతిభను గుర్తించిన తండ్రి 2018లో ఆమెకు ఎస్ఆర్‌హెచ్ సీఈఓ బాధ్యతలు అప్పగించాడు.

సన్‌రైజర్స్‌కు కూడా..

ఎస్ఆర్‌హెచ్ సీఈఓగా కావ్య సక్సెస్‌ఫుల్ జర్నీని కొనసాగిస్తూనే సన్ గ్రూప్‌లో సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేస్తుంది. సన్ మ్యూజిక్.. ఎఫ్ఎం రేడియో చానల్ బాధ్యతను కూడా చూస్తుంది. మీడియా నిర్వహణలో ఇవన్నీ ఆమెకు మంచి ఎక్స్‌పీరియన్స్‌గా ఉపయోగపడుతున్నాయి. క్రికెట్ ప్రాంచైజీ వైపు రావడానికి ఆటపై ఆసక్తి మాత్రమే కాదు.. దాని ద్వారా ఏదైనా సాధించాలి అనే తపన ఎక్కువగా ఉంది. ఐపీఎల్‌తో పాటు సౌత్ ఆఫ్రికా SA20 లీగ్‌లో సైన్ రైజర్స్ కేప్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తోంది. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో.. క్రికెటర్ రిషబ్ పంత్‌తో ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. వాటన్నింటినీ ఆమె తిప్పికొట్టింది.

ఎమోషనల్ పర్సన్

ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ వస్తుంటే తెరపై కావ్య ఎప్పుడు కనిపిస్తుందా అని కొందరు అభిమానులు ఎదురుచూస్తుంటారు. వికెట్ పడ్డప్పుడు షిట్ అని ముఖం మార్చుతుంది. సిక్సర్ కొట్టిన్పుడు లేచి నిలబడి హూ అని సంతోషపడుతుంది. 2018 నుంచి 2024 వరకు మొత్తం 103 మ్యాచ్‌లు ఆడింది ఎస్ఆర్‌హెచ్. వీటిలో 48 మ్యాచ్‌లు గెలిచింది. ఈ లెక్కన 46.6 సక్సెస్ రేట్‌తో ఉంది. ఐతే ఐపీఎల్ కప్ ఒకసారి గెలవలేదు. 2016లో గెలిచినప్పటికీ అప్పుడామె సీఈఓ కాదు. 2024లో ఫైనల్ వరకు వెళ్లింది. 2018, 2020, 2024 మూడుసార్లు ప్లేఆఫ్ అర్హత సాధించింది. సౌతాఫ్రికా లీగ్‌లో మాత్రం రెండుసార్లు 2023, 2024లో టైటిల్ గెలిచింది. 2024లో ఐపీఎల్ ఫైనల్ కప్ చేజారడంతో "బాధపడొద్దు.. నేను గర్వపడేలా చేశారు" అని పాజిటివిటీని ఆటగాళ్లకు ఇచ్చింది.

క్వీన్ ఆఫ్ ది సన్ ఎంపైర్"

కావ్య వ్యక్తిగత సంపద సుమారు రూ.409 కోట్లు ఉంటుందని అంచనా. సన్ గ్రూప్ ద్వారా నడిపే కళానిధి మారన్ అండ్ కావేరి కళానిధి ఫౌండేషన్లో భగంగా విద్య.. ఆరోగ్యం.. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2019లో కళానిధి మారన్ స్కాలర్ షిప్ ఫండ్ ట్రస్టీగా నియమితులైంది. ఇది విద్యార్థులకు సాయం చేసే సంస్థ. ఆమెది వ్యాపార నేపథ్యమున్న కుటుంబమే అయుండొచ్చు. వ్యాపారాలతో వేలకోట్ల సంపద ఉన్న కుటుంబమే అయుండొచ్చు. ఇవన్నీ ఉన్నా ఆమె చాలా శ్రమచేర్చి ఎస్ఆర్‌హెచ్‌ను పోటీ జట్టుగా మార్చింది. ఒక యువతిగా కలను సాకారం చేసుకొని.. సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే కావ్య మారన్ "క్వీన్ ఆఫ్ ది సన్ ఎంపైర్" అయ్యింది. 


Read More..

‘ద మోస్ట్ లక్కీయెస్ట్ ఫ్యామిలీ.. షావుకారు జానకి కుటుంబం  

Tags:    

Similar News