పాకిస్తాన్‌కు ఘోర అవమానం

క్రితం ఎడిషన్‌లో చాంపియన్లుగా నిలిచిన జపాన్ జట్టు ఈ సారి అజ్లాన్ షా టోర్నీలో పాల్గొనడం లేదు.

Update: 2025-03-26 16:47 GMT
పాకిస్తాన్‌కు ఘోర అవమానం
  • whatsapp icon

- సుల్తాన్ అజ్లాన్‌షా టోర్నీకి అందని ఆహ్వానం

- మలేషియా హాకీ ఫెడరేషన్‌తో పాకిస్తాన్‌కు అప్పు

- తీర్చలేదనే కారణంతోనే పాకిస్తన్‌ దూరం

దిశ, స్పోర్ట్స్: క్రీడా ప్రపంచంలో ఏ జట్టుకూ ఎదురవ్వని అవమానాన్ని పాకిస్తాన్ హాకీ జట్టు ఎదుర్కున్నది. సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ కప్‌కు ఆ జట్టుకు ఆహ్వానం అందలేదు. గతంలో జరిగిన ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అయినా సరే ఆ జట్టును ఆహ్వానించడానికి మలేషియా హకీ ఫెడరేషన్ నిరాకరించింది. ఈ ఏడాది నవంబర్‌లో మలేషియా వేదికగా సుల్తాన్ అజ్లాన్‌షా కప్ జరగాల్సి ఉంది. మలేషియా హకీ ఫెడరేషన్ ఈ టోర్నీ కోసం అందరికీ ఆహ్వానాలు పంపాల్సి ఉండగా.. రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌ను మాత్రం పక్కన పెట్టింది. పాకిస్తాన్ హకీ ఫెడరేషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా మలేషియా హాకీ ఫెడరేషన్ అప్పులపాలైంది. ఆ విషయంపై ఎన్ని సార్లు పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్‌ను సంప్రదించినా సరైన సమాధానం రాలేదు. దీంతో ఈ ఏడాది ఆ జట్టుకు ఆహ్వానం పంపకూడదని మలేషియా నిర్ణయించింది.

మరోవైపు క్రితం ఎడిషన్‌లో చాంపియన్లుగా నిలిచిన జపాన్ జట్టు ఈ సారి అజ్లాన్ షా టోర్నీలో పాల్గొనడం లేదు. ఇప్పటికే షెడ్యూల్ టైట్‌గా ఉండటంతో అజ్లాన్ షా టోర్నీకి సమయం కేటాయించలేమని ఆ జట్టు తెలిపింది. 1983లో మొదలైన అజ్లాన్ షా హాకీ టోర్నీ.. మొదట్లో రెండేళ్ల టోర్నీగా మొదలైనా.. 1998 నుంచి ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ టోర్నీని ఆస్ట్రేలియా జట్టు 10 సార్లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇండియా ఐదు సార్లు గెలవగా.. పాకిస్తాన్ మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా జట్టు తీవ్రంగా నష్టపోతోంది. తాజాగా మలేషియా హాకీ ఫెడరేషన్ కూడా అప్పులను క్లియర్ చేస్తేనే కానీ టోర్నీలో ఆడించబోమని తేల్చి చెప్పింది.

Tags:    

Similar News