సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. వరుసగా కీలక వికెట్లు డౌన్

వైజాగ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 10వ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ఎచ్ జట్టు అభిమానులకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది.

Update: 2025-03-30 10:37 GMT
సన్ రైజర్స్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. వరుసగా కీలక వికెట్లు డౌన్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వైజాగ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 10వ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ఎచ్ జట్టు అభిమానులకు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ రనౌట్ కాగా.. స్టార్క్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డీలు వెంట వెంటనే అవుట్ అయ్యారు. అనంతరం 4.1 వ బంతికి ట్రావిస్ హెడ్ ను కూడా స్టార్క్ అవుట్ చేశాడు. దీంతో తెలుగు గడ్డపై భారీ స్కోర్ చేస్తుందని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకొవడంతో.. పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ప్రస్తుతం క్రీజులో.. అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఐదు ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 37 పరుగుల వద్ద కొనసాగుతుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువ బ్యాటర్ అనికేత్ వర్మ, భారీ హిట్టర్ క్లాసిన్ జట్టుకు ఏ విధమైన ముగింపు ఇస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(w), KL రాహుల్, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

Similar News