CSK VS MI : చెన్నయ్ బాల్ టాంపరింగ్ చేసిందా?.. వీడియో వైరల్

ఐపీఎల్‌లో బాల్ టాంపరింగ్ వార్తలు కలకలం రేపాయి. చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయి.

Update: 2025-03-24 15:28 GMT
CSK VS MI : చెన్నయ్ బాల్ టాంపరింగ్ చేసిందా?.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో బాల్ టాంపరింగ్ వార్తలు కలకలం రేపాయి. చెన్నయ్ సూపర్ కింగ్స్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో తలపడిన చెన్నయ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, బౌలర్ ఖలీల్ అహ్మద్ బాల్ టాంపరింగ్ చేశారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఆ మ్యాచ్‌లో ఖలీల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు తీసి 29 పరుగులే ఇచ్చి ముంబైని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ముంబై ఇన్నింగ్స్‌లో ఖలీల్ బౌలింగ్ ప్రారంభించడానికి ముందు గైక్వాడ్ అతని దగ్గరి వెళ్లాడు. అతనితో కాసేపు మాట్లాడాడు. అదే సమయంలో ఖలీల్ తన ప్యాంటు జేబులోంచి ఏదో తీశాడు. అది గైక్వాడ్‌‌కు ఇవ్వగా అతను తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు ఖలీల్, గైక్వాడ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై బీసీసీఐ విచారణ చేసి వారిద్దరిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, సీఎస్కే ఫ్యాన్స్ ఆ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. ఖలీల్ తన చేతికి ఉన్న ఉంగరాన్ని గైక్వాడ్‌కు ఇచ్చాడని చెబుతున్నారు. అయితే, గైక్వాడ్‌కు ఖలీల్ ఏం ఇచ్చాడనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఐపీఎల్ నిర్వాహకులు స్పందించాల్సి ఉంది. గతంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి రెండేళ్లు నిషేధం ఎదుర్కొన విషయం తెలిసిందే.



Tags:    

Similar News