TG Budget: అన్నదాతలకు శుభవార్త.. ఆ పథకానికి ఏకంగా రూ.18 వేల కోట్లు కేటాయింపు

రాష్ట్రంలోని అన్నదాతలకు తెలంగాణ సర్కార్ (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-03-19 07:55 GMT
TG Budget: అన్నదాతలకు శుభవార్త.. ఆ పథకానికి ఏకంగా రూ.18 వేల కోట్లు కేటాయింపు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్నదాతలకు తెలంగాణ సర్కార్ (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లు కాగా, అందులో ఏకంగా వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు కేటాయించింది. రైతు భరోసా పథకానికి గాను రూ.18 వేల కోట్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) సభలో వెల్లడించారు. ఇటీవలే ప్రభుత్వం మూడు ఎకరాల లోపు ఉన్న 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్ల రైతు భరోసా నిధులను జమ చేసింది. మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించడంతో త్వరలోనే అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం డబ్బులు అందనున్నాయి.

రైతు రుణమాఫీ కింద ఇప్పటికే ప్రభుత్వం 25.35 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలోరూ.20,616 కోట్ల నిధులను రైతు ఖాతాల్లో జమ చేసింది. త్వరలో అమలు చేయబోయే రైతు భరోసాకు పథకానికి, సాగు భూముల వడపోతకు గాను త్వరలో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఫిల్టర్ చేయనున్నారు. మొత్తం 40 లక్షల ఎకరాల్లో సన్న వడ్ల సాగు విస్తీర్ణం పెగిరిన క్రమంలో క్వింటాకు రూ.500 చొప్పున ఆ పథకాన్ని కొనసాగిస్తూ అందుకు బడ్జెట్‌లో రూ.1,670 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచనున్నారు. ఇక ఆయిల్ పామ్ సాగుకు టన్నుకు రూ.2 వేల అదనపు సబ్సిడీ ఇవ్వనున్నారు. పశుసంవర్థక శాఖకు రూ.1,674 కోట్లు కేటాయిస్తూ.. పశువైద్య టీకాల తయారీలో భారీ విస్తరణ ప్రణాళికను రూపొందించున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతులు కల్పన కోసం రూ.181 కోట్ల నిధులు కేటాయించారు.

Read More..

బడ్జెట్ 2025: బీసీ సంక్షేమానికి పెరిగిన బడ్జెట్  

Tags:    

Similar News