బెట్టింగ్ యాప్స్ కేసులు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ పై చిన్నపాటి యుద్ధం కొనసాగుతుంది. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ పు ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, యాక్టర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు, నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-03-21 03:58 GMT
బెట్టింగ్ యాప్స్ కేసులు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ పై చిన్నపాటి యుద్ధం కొనసాగుతుంది. ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ పు ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, యాక్టర్లపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు, నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరి.. టేస్టీ తేజ, కిరణ్‌గౌడ్‌లు విచారణకు హాజరయ్యారు. ఇందులో తీవ్ర ఆరోపణలు ఎందుర్కొంటున్న మరికొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు అందుబాటులోకి రాలేదు. అందులో హర్ష సాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీ యాదవ్ లు ఇప్పటికే దుబాయ్ పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని తిరిగి రప్పించడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. అయితే గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని సినీతారలపై కేసులు నమోదు చేశారు.

అయితే సినీ ప్రముఖుల విషయంలో పోలీసులు న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. అలాగే యువతను తప్పుదారి పట్టించే ఈ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోషన్స్‌తో.. భారీగా లబ్ధి పొందిన సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లుకు సదరు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి, ఏ ఏ మార్గాల్లో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకున్నారనే కోణంలో.. వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేసులు నమోదైన వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు ఓ కన్నేసినట్లు సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికి ఓ వ్యక్తి ప్రారంభించిన ఈ ఉద్యమం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు చుక్కలు చూపిస్తుంది. ఈ బెట్టింగ్ భూతం పై పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Read More..

Betting Apps Pramotion Case : బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇరుక్కోనున్న మెట్రోరైలు సంస్థ  

Similar News