BRS MLCs: అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన కంటిన్యూ
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన కంటిన్యూ అవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ బడ్జెట్ (Telangana Budget 2025-26) సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల (BRS MLCs) వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. రోజుకో అంశంపై నిరనస వ్యక్తం చేస్తున్న గులాబీ పార్టీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇవాళ శాసనమండలి ఆవరణంలో (Legislative Council) ఎమ్మెల్సీ కవితతో పాటు నిరసన తెలియజేశారు. 'అప్పులు ఘనం అభివృద్ధి శూన్యం' అంటూ ప్లకార్డులు పట్టుకుని అప్పులు ఆకాశంలో అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష 58 వేల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ.2,500 ఇచ్చారు?ఎంతమంది వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇచ్చారు? ఎంత మందికి తులం బంగారం ఇచ్చారు అని నిలదీశారు.