తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఉదయం ఆర్ధిక మంత్రి భట్టివిక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు.

Update: 2025-03-19 07:58 GMT
తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఉదయం ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క (Finance Minister Bhatti Vikramarka) 2025-26 వార్షిక బడ్జెట్‌ (Annual Budget 2025-26)ను ప్రవేశ పెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉన్నట్లు సూచించారు. అలాగే మూల వ్యయం రూ.36,504 కోట్లు గా చూపించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ రెండో బడ్జెట్  (Second budget)పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన బడ్జెట్ పై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో ఆరు గ్యారెంటీల (Six guarantees)ను మరచిపోయారు, నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని ఇచ్చిన మాటలను ఈ బడ్జెట్‌లో పాతరేశారని విమర్శించారు. అలాగే ఈ బడ్జెట్ చూసిన తర్వాత తెలంగాణ మహిళలు, వృద్ధులు నిరాశకు గురయ్యారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన 420 హామీల గురించి బడ్జెట్ లో ఎక్కడ నిధులు కేటాయించలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తులం బంగారం పథకం, 4000 పింఛన్, మహిళలకు 2500 పథకాలకు ఈ బడ్జెట్ లో ఎటువంటి కేటాయింపులు చేయలేదని.. కేటీఆర్ (KTR) మండిపడ్డారు.

Read More..

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కి టూలెట్ బోర్డు.. మాజీసీఎం తీరుపై సర్వత్రా విమర్శలు  

TG Budget: అన్నదాతలకు శుభవార్త.. ఆ పథకానికి ఏకంగా రూ.18 వేల కోట్లు కేటాయింపు  


Similar News