TG Budget: హైదరాబాద్ ఇక ‘H-CITY’.. రూ.7,032 కోట్ల నిధులు కేటాయింపు
హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై సర్కార్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై సర్కార్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. 2025-26 వార్షిక బడ్జెట్‌లో అభివృద్ధి పనులకు గాను భారీగా నిధులు కేటాయించింది. పారిశ్రామిక వృద్ధి కోసం హైదరాబాద్ మెగా మాస్టర్ ప్లాన్-2050 టార్గెట్‌గా పెట్టుకుని గ్లోబల్ టెట్ హబ్‌తో పాటు నగరాన్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి రూ.2,700 కోట్లు కేటాయించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పనకు H-CITY ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 31 ఫ్లై ఓవర్లు, 17 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. ఆ పనులకు గాను బడ్జెట్‌లో రూ.7,032 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. అదేవిధంగా రూ.150 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.
నగరంలో వరద నివారణకు రూ.5,942 కోట్లు వెచ్చించారు. NH-163కి ఇరువైపులా పారాశ్రామిక కారిడార్ నిర్మించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని శివారు ప్రాంతాల్లో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పనున్నారు. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు, 200 ఎకారల్లో AI సిటీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా ITIs ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి మొత్తం 65 సెంటర్లలో టాటా టెక్సాలజీ భాగస్వామ్యతో ప్రత్యేక కోర్సులను అమలు చేయనున్నారు. BFSI రంగంలో టెక్ ట్రైనింగ్ ద్వారా సుమారు 10 వేల మందికి లబ్ధి చేకూరనుంది. ఇక తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రాన్న అధునీకరించనున్నారు.
Read More..
TG Budget: అన్నదాతలకు శుభవార్త.. ఆ పథకానికి ఏకంగా రూ.18 వేల కోట్లు కేటాయింపు