బెట్టింగ్ వల్ల ఎవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు: హీరో సంపూర్ణేష్ బాబు
ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ల బారిన పడి అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ (Betting app)ల బారిన పడి అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బెట్టింగ్ యాప్ లను కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్యూలెన్సర్లు (Social media influencers), యూట్యూబర్లు (YouTubers) ప్రమోట్ చేస్తుండటంతో.. వారిని ఫాలో అవుతున్న యువకులు గుడ్డిగా నమ్మి.. యాప్‌లను డౌన్ లోడ్ చేసుకొని.. అప్పులపాలు అవ్వడంతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో అమయక యువతను బెట్టింగ్ యాప్స్ (Betting apps) వైపు పంపుతున్న వారిపై సోషల్ మీడియా వేదికగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ (IPS officer Sajjanar)తో పాటు.. పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్యులెన్సర్లు యుద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ (Promote betting apps) చేస్తున్న వారిపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం.. బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా యూజర్లు తమ స్నేహితులు సన్నిహితులు వాటి బారిన పడకుండా ఉండేందుకు తమ వంతు కృషి చేయాలని ఐపీఎస్ అధికారి సజ్జనార్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు (Tollywood hero Sampoornesh Babu).. ముందుకు వచ్చాడు. బెట్టింగ్ యాప్స్‌కూ దూరంగా ఉండాలని.. చెబుతూ.. బెట్టింగ్ యాప్స్ (Betting apps) పై హీరో సంపూర్ణేష్ బాబు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో "కొందరు యువత బెట్టింగ్ వంటి అనవసరమైన వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ బెట్టింగుల వల్ల బాగుపడినట్టు చరిత్రలో లేదు. వీటికి బానిస అయ్యే ముందు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నటుడు సంపూర్ణేష్ బాబు తన వీడియోలో చెప్పుకొచ్చారు.
READ MORE ...
కన్నప్ప నుంచి మరో అప్‌డేట్.. ఆశక్తికరంగా మహాదేవ శాస్త్రీ లుక్