TG High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషనర్‌కు భారీగా జరిమానా
ఓ కేసులో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) న్యాయమూర్తి నగేశ్ (Nagesh) సంచలన తీర్పును వెలువరించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఓ కేసులో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) న్యాయమూర్తి నగేశ్ (Nagesh) సంచలన తీర్పును వెలువరించారు. ఈ మేరకు పిటిషనర్‌కు రూ.జరిమానా విధిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ భూముల విషయంలో హైకోర్టు (High Court)లో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచి పెట్టి వేరే బెంచ్‌ను పిటిషనర్లు ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కోర్టును తప్పుదోవ పట్టించేలా.. వారి సమయం వృథా చేసేలా మరో బెంచ్‌లో తిరిగి పిటిషన్లు వేయడం న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ భూములు కాజేయాలని తప్పుడు రిట్ పిటిషన్లు వేసిన పిటిషనర్లకు రూ.కోటి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు.