TG Govt.: సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ షురూ.. ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు
రాష్ట్రంలో టాలీవుడ్ (Tollywood) భవితవ్యంపై చర్చించేందుకు సినీ ప్రముఖులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీ అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో టాలీవుడ్ (Tollywood) భవితవ్యంపై చర్చించేందుకు సినీ ప్రముఖులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) వేదికగా టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాల శివ, వశిష్ట, సాయి రాజేష్, బోయపాటి శ్రీనివాస్, సి.కల్యాణ్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఇక ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka), డీజీపీ జితేందర్ (DGP Jitender), హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త (Ravi Gupta) సమావేశంలో పాల్గొన్నారు.
ఈ భేటీలో భాగంగా ఇండస్ట్రీ పెద్దల ముందు ప్రభుత్వం కీలక ప్రతిపాదలను ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ (Anti drugs campaign)కు సహకరించాలని కోరబోతున్నట్లుగా సమాచారం. ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలని సర్కార్ సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. టికెట్ల ధరలపై విధించే సెస్‌ను.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (Integrated Schools) నిర్మాణానికి వినియోగించాలని సర్కార్ ప్రతిపాదించింది. అదేవిధంగా కులగణన (Cast Census) సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం ఉండాలని సీఎం కోరినట్లుగా తెలుస్తోంది.
Read More...
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు క్యూకట్టిన సెలబ్రేటీలు