TG Assembly: ఆ వార్త బయటకు రాకుండా తొక్కిపెట్టారు.. ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయిందని బీఆర్ఎస్ సభ్యుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-03-17 05:54 GMT
TG Assembly: ఆ వార్త బయటకు రాకుండా తొక్కిపెట్టారు.. ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయిందని బీఆర్ఎస్ సభ్యుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో డైట్ చార్జీలు (Diet Charges), కాస్మొటిక్ చార్జీల (Cosmetic Charges)పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ వచ్చాక ప్రభుత్వ సంక్షేమ హస్టళ్లలో పరిస్థితులు తారుమారు అయ్యాయని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు 83 మంది గురుకుల హాస్టల్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning), పాము కాట్లతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టి తీసుకొచ్చారు. దుబ్బాక (Dubbaka) నియోకవర్గంలోని బీసీ హాస్టల్‌లో ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపారు. రెండు రోజుల నుంచి ఆ విద్యార్థి కోమాలోనే ఉన్నాడని పేర్కొన్నారు. ఈ వార్త ఎక్కడా బయటకు రాకుండా ప్రభుత్వం తొక్కిపెట్టిందని ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) సభలో ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

Tags:    

Similar News