బెట్టింగ్ యాప్స్ ప్రమోట్.. టీజీసీఎస్బీ డీజీ స్ట్రాంగ్ వార్నింగ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఉపేక్షించేది లేదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేసిన కేసులు నమోదు అవుతాయని, ఎవరిని ఉపేక్షించేది లేదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రెటిల కేసులు నమోదు అయిన నేపధ్యంలో బుధవారం డీజీ శిఖా గోయల్ మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాధించవచ్చని, షార్ట్ టర్మ్‌లో ధనవంతులు అవ్వచ్చని యువత బెట్టింగ్ యాప్ లలో పెద్ద మొత్తంలో పోగుట్టుకుంటున్నారని పలు ఫిర్యాదు కూడా అందాయని తెలిపారు. ఇటువంటీ యాప్స్ మోసాలకు యువత బలి కావద్దని సూచించారు. లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంటనే ఇస్తున్నరని లోన్ యాప్స్‌తో అప్పులు తీసుకుని వారి వేధింపులకు పలువురు అత్మహత్యలకు పాల్పడ్డరని తెలిపారు. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ నియంత్రణకు జియోఫెన్సింగ్ కు చర్యలు చెపడుతున్నట్లు తెలిపారు.
2017లో అన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌ని గేమింగ్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఈ నిషేధం ఉన్నట్లు తెలిపారు. జనవరి నెలలో గేమింగ్ ఫేడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియాకు చెందిన ప్రముఖ కంపెనీలతో గేమింగ్ నిబంధనలపై సమావేశం నిర్వహించామన్నారు. 133 కంపెనీలకు నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు. 2022 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్‌పై 797కేసులు టీజీసీఎస్బీ నమోదు చేసినట్లు వెల్లడించారు. విదేశాలనుంచి అపరేట్ చేస్తున్న యాప్స్ వల్ల ఎక్కువగా నష్ట పోతున్నారు. గేమింగ్ కు సబంధించి 108 యూఆర్ఎల్‌పై నిషేందించినట్లు తెలిపారు.