TG Assembly: మా జన్మ ధన్యమైందని భవిస్తున్నా.. విప్ ఆది శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ (Telangana) కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్‌ (Role Model)గా నిలిచిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు.

Update: 2025-03-18 05:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్‌ (Role Model)గా నిలిచిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ (Assembly) మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) తూతుమంత్రంగా చేపట్టిన సర్వేలా కాకుండా పక్కగా లెక్కలతో పకడ్బందీగా సర్వే నిర్వహించామని పేర్కొన్నారు. తెలంగాణ (Telangana) సమగ్ర సర్వేను చూసి దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తమ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేశారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) చైర్మన్‌గా ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిటీ (BC Dedicated Committe) వేసి ఎక్కడా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా సర్వే కొనసాగిందని అన్నారు. కులగణలో 56.36 శాతం బలహీనవర్గాలు ఉన్నట్లుగా తేలిందని అన్నారు. బీసీ (BC)లకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. రూపొందించిన బిల్లు ఆమోదం పొందడంతో తమ జీవతం ధన్యమైనట్లుగా భావిస్తున్నామని అన్నారు. 

Tags:    

Similar News