నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే శంకుస్థాపనలు : ఎమ్మెల్యే దానం నాగేందర్​

నాకు తెలియకుండానే నా నియోజకవర్గంలోని ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారని తాను వెళ్లి దానిని పగలగొట్టానని, లోకల్ ఎమ్మెల్యే అయిన తనకు చెప్పకుండా శంకుస్థాపన చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update: 2025-03-18 17:02 GMT
నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే శంకుస్థాపనలు : ఎమ్మెల్యే దానం నాగేందర్​
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : నాకు తెలియకుండానే నా నియోజకవర్గంలోని ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారని తాను వెళ్లి దానిని పగలగొట్టానని, లోకల్ ఎమ్మెల్యే అయిన తనకు చెప్పకుండా శంకుస్థాపన చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తనకు మరో అవకాశం లేక దాన్ని పగలగొట్టానని బాహాటంగా ప్రకటించారు. మంగళవారం శాసనసభలో జీరో అవర్ లో​మాట్లాడుతూ ఇదే స్థలానికి పక్కన ఉన్న కొంత స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం స్థలం ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు కోడిగుడ్లు ఇవ్వడం లేదని దానం మండిపడ్డారు. తాను అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేనని, తనకు ఎవరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదా అని  కుండ బద్దలు కొట్టారు.

కొత్త భవనాల విషయంలో సోషల్ మీడియా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, వాటికి జీహెచ్ఎంసీ అధికారులు భయపడిపోతున్నారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించని అధికారులు సోషల్ మీడియా వాళ్లు ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు, వాళ్లు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారని వీటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News