సీఎం రేవంత్​ పాలన కేసీఆర్ ​బాటలో కొనసాగుతోంది : బీజేఎల్పీనేత మహేశ్వర్​రెడ్డి

రాష్ట్రంలో అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని బీజేఎల్పీనేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

Update: 2025-03-27 17:11 GMT
సీఎం రేవంత్​ పాలన కేసీఆర్ ​బాటలో కొనసాగుతోంది : బీజేఎల్పీనేత మహేశ్వర్​రెడ్డి
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని బీజేఎల్పీనేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రభుత్వం పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తిలా ఉందని ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ తెలంగాణ అప్పుల పరిస్థితికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్ అయితే, రెండో ముద్దాయి కాంగ్రెస్ అని విరుచుక పడ్డారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై రాహుల్ గాంధీ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. పదిహేను నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1.63 లక్షల కోట్లు అప్పులు చేసిందని అన్నారు. అప్పులు చేయడంలో మాత్రమే తెలంగాణ రైజింగ్ కనిపిస్తోందని విమర్శించారు.

గత బీఆర్ఎస్ చేసిన లక్షల కోట్ల విధ్వంసంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ దారిలోనే నడవడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడవద్దని, బీఆర్ఎస్ కాంగ్రెస్ కూటమిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. కుటుంబ పార్టీలు మాత్రమే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసంపై కాంగ్రెస్ ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వం 11 శాతానికి తెచ్చిన అప్పులను రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారో లేదో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.

హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలమైంది. ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ. 2500 రూపాయలు, వృద్దులకు పెంచాల్సిన పెన్షన్లు జాడలేవని, తులం బంగారం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం అందించడం లేదని శాంతి భద్రతల వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఎప్పటిలోగా అందిస్తారో చెప్పాలని డిమాండ్​చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనేక నిధులు కేటాయించిందని, బీబీనగర్​ఎయిమ్స్​వంటి ప్రాజెక్టులను మంజూరు చేసిందని, తమిళనాడులో డీఎంకె డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వెనక్కి తగ్గిందన్నారు. కాంగ్రెస్​,డీఎంకె, టీఆర్​ఎస్​ పార్టీలు కుటుంబ పాలనలో నడుస్తున్నాయని విమర్శించారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్​రాష్ట్రాలకు లక్షలాది కోట్ల నిధులు అందించిందని. గతంలో కాంగ్రెస్​పాలనలో కూడా నిధులు అక్కడ పెద్దమొత్తంలో కేటాయించిందని గుర్తు చేశారు. రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటాను మోడీ ప్రభుత్వం 10 శాతం పెంచిందని పేర్కొన్నారు.

Tags:    

Similar News