TG Assembly: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం అయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలి సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై విపక్ష నేతలు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నను సంధించారు. అందుకు మంత్రి సమాధానమిస్తూ.. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ముమ్మాటికీ కట్టుబడి ఉందని అన్నారు. అయితే, ఇంకా సుందిళ్ల బ్యారేజీ సీపేజ్ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం హయాంలో గంధమల్లపై ఇప్పటి వరకు ఒక్క రూపాయి పని కూడా జరగలేదని ఆరోపించారు. అక్కడి భూ సేకరణపై అధికారులతో ఓ కమిటీని నియమించి అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ అక్కడున్న స్థానికులు భూ సేకరణకు స్వచ్ఛందంగా సహకరిస్తే యుద్ధ ప్రాతిపదికన 1.5 టీఎంసీ నీళ్లను స్టోర్ చేసే విధంగా వెంటనే పనులను ప్రారంభిస్తామని అన్నారు.