TG Assembly: అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ నినాదాలు.. 15 నిమిషాల పాటు సభ వాయిదా
ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఆరో రోజు అసెంబ్లీ (Assembly) సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఫార్ములా ఈ-రేసుపై (Formula E-Race) వాయిదా తీర్మానాన్ని అందజేసింది. అనంతరం బీఆర్ఎస్ (BRS) సభ్యులు నల్లని బ్యాడ్జీలను ధరించి సభకు హాజరయ్యారు. కేటీఆర్ (KTR)పై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.పేపర్లను చింపేసీ స్పీకర్ పోడియం వైపు విసిరారు. అనంతరం ఫార్ములా ఈ-కారు రేసు (Formula E-Race) అంశంపై సభలో చర్చ పెట్టాలని పట్టుబట్టారు. మరో వైపు ఆందోళన విరమించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) వారించినా బీఆర్ఎస్ (BRS) సభ్యులు పట్టు వీడలేదు. దీంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.