Ponnam: కేటీఆర్ నీ నిజాయితీ నిరూపించుకో.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

కేటీఆర్(KTRBRS) పై విచారణ జరుగుతుందని, విచారణలో తన నిజాయితీ నిరూపించుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar) అన్నారు.

Update: 2024-12-20 11:06 GMT

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్(KTRBRS) పై విచారణ జరుగుతుందని, విచారణలో తన నిజాయితీ నిరూపించుకోవాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్(Assembly Media Point) లో ఆయన మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేస్ కేసులో(Formula E Race Case) కేటీఆర్ అరెస్ట్(KTR Arrest) పై స్పందించారు. ప్రజాస్వామ్యంలో చట్టబద్దంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను పక్కనబెట్టి, వాళ్లు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని ఆరోపిస్తూ.. ఏసీబీ చేసిందన్నారు. ఏసీబీ ఎవరు ఏది చెబితే అది వినే సంస్థ కాదని, అది స్వతంత్ర సంస్థ అని చెప్పారు.

అలాగే ఈ కేసు గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేస్ ద్వారా ప్రభుత్వానికి 7 వందల కోట్ల లాభం వచ్చింది.. 2 వందల కోట్లు ఖర్చు పెడితే ఏం అవుతుందని చెబుతున్నారని, అది ఎక్కడ వచ్చిందో చెప్పాలని నిలదీశారు. అంతేగాక మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని, ఇది బయటపడదు అనే అపోహలో చేసింది కాదా అని ప్రశ్నించారు. ఈ కేసులో మీరు చట్టబద్దంగా.. నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఉంటే నిర్దోషిగా బయటికి వస్తారని, అలాంటిది విచారణకు సహకరించకుండా అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. కేటీఆర్ చెబుతున్నట్లుగా డబ్బు కట్టే విషయంలో ఎవరు మాట్లాడటం లేదని, కానీ అందులో నియమ నిబంధనలు పాటించలేదనే ఏసీబీ కేసు పెట్టిందని, విచారణకు గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారని తెలిపారు. ఇక ఈ కేసులో విచారణకు సహకరించి, మీ నిజాయితీ నిరూపించుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు.

Tags:    

Similar News