Breaking: మల్లారెడ్డి కాలేజ్ లో ఉద్రిక్తత.. కారణం ఇదే

గతంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే భోజనంలో పురుగులు ఉంటున్నాయనే వార్తలు వినిపించేవి.

Update: 2024-03-05 07:07 GMT

దిశ డైనమిక్ బ్యూరో: గతంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే భోజనంలో పురుగులు ఉంటున్నాయనే వార్తలు వినిపించేవి. అయితే ప్రస్తుతం రోజులు మారాయి. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు అందించే భోజనంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ లక్షలకు లక్షలు ఫీజు తీసుకునే ప్రైవేట్ కళాశాలలు మాత్రం విద్యార్థులకు అందించే భోజంలో నాణ్యతను పాటించడం లేదు.

ముఖ్యంగా మల్లారెడ్డి కళాశాలలు ఈ విషయంలో తరుచూ వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో తమకు అందిస్తున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే ఇకపై భోజనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కళాశాల చైర్మన్ మల్లారెడ్డి హామీ ఇచ్చారు. దీనితో విద్యార్థులు తమ నిరసన విరమించుకున్నారు.

అయితే తాజాగా మల్లారెడ్డి కళాశాల మరోసారి వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ శివారు గండి మైసమ్మలో ఉన్న MREC క్యాంపస్ లో గత రాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాత్రి భోజన సమయంలో అన్నం, స్వీట్ లో పురుగులు వచ్చాయని విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురైయ్యారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని నిరసనకు దిగారు.

క్వాలిటీ ఫుట్ పెట్టడం లేదని.. వీ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నిసార్లు చెప్పిన యాజమాన్యం వినిపించుకోవడం లేదని.. చైర్మన్ మల్లారెడ్డి వచ్చేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీనితో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక మల్లారెడ్డి కళాశాల చైర్మన్ సాధారణ వ్యక్తి కాదు.

మాజీ మంత్రి, ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ప్రజాప్రతినిధి. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలల్లో విద్యార్థులు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారని ఆందోళన చేపట్టడం నిజంగా బాధాకరం అని ఈ విషయం తెలిసిన వాళ్ళు అంటున్నారు. అలానే లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించే ఈ విద్యార్థుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ప్రభుత్వ హాస్టళ్లల్లో ఉండే విద్యార్థులకు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం న్యాయం చేస్తారనే ప్రశ్న ప్రజల్లో మెదులుతోందని సంబంధిత వర్గాల సమాచారం. 

Tags:    

Similar News