సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకోం.. తేల్చి చెప్పిన TGPEA

రామగుండంలో నిర్మించనున్న థర్మల్ ప్లాంటులో సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకునేది లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు...

Update: 2024-09-22 16:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రామగుండంలో నిర్మించనున్న థర్మల్ ప్లాంటులో సింగరేణి భాగస్వామ్యాన్ని ఒప్పుకునేది లేదని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డ జెన్కో ఆడిటోరియంలో ఆదివారం తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో జరగనున్న పురోగతి, సంస్థ మనుగడకు సంబంధించి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సూచనల మేరకు గృహ, వాణిగ్య వినియోగదారులకు ముఖ్యంగా రైతులకు 24x7 నాణ్యమైన విద్యుత్ అందించడానికి ఇంజినీర్లంతా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టీజీ జెన్కో, సింగరేణి ఆధ్వర్యంలో జాయింట్ వెంచర్‌గా 1x800 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాలని తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం వ్యతిరేకించారు.

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ అయిన టీజీ జెన్కో ద్వారానే రామగుండం థర్మల్ ప్లాంట్(1x800) నిర్మించాలని ఏకగ్రీవంగా తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం తీర్మానించారు. ట్రాన్స్ కో, జెన్కోలో రెగ్యులర్ సీఎండీలను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులను వెంటనే నియమించాలన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ రిక్రూట్ మెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని తీర్మానించినట్లు చెప్పారు. ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జెన్కో ఏఈ టు ఏడీఈ, ఏడీఈ టు డీఈ ప్రమోషన్ ఇవ్వాలని, ట్రాన్స్ కోలో ఏఈ టు ఏడీఈఏ, ఏడీఈ టు డీఈ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. ఎన్పీడీసీఎల్‌లో ఏఈ టు ఏడీఈ ప్రమోషన్ ఇవ్వాలని, డిస్కంలో ప్రమోషన్స్ ఇచ్చిన వారికి పోస్టింగులు ఇవ్వాలని తీర్మానించినట్లు చెప్పారు. ఇంజినీర్లు, డిప్లొమా ఇంజినీర్లకు ప్రమోషన్ ఇచ్చే క్రమంలో 4:1 అవలంభిస్తారని, కానీ అందులో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లకు అన్యాయం జరిగిందని, దానికి సంబంధించి అమెండ్‌మెంట్ చేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నాకర్ రావు, ప్రధాన కార్యదర్శి సదానందం తీర్మానించారు.


Similar News