‘ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తాం అంటూ మభ్యపెట్టడం కరెక్ట్ కాదు’

గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బకాయిపడిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Update: 2025-01-03 16:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బకాయిపడిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి అజిత్ రెడ్డిని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా యదయ్య గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఏడాదికాలంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందులతో అనేకమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సర్పంచులు వడ్డీలు కట్టలేక అప్పులు ఇచ్చిన వారితో వేధింపులకు గురవుతున్నారన్నారు.

ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెపుతూ సర్పంచ్‌లను మభ్య పెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు చేసి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, కేశబోయిన మల్లయ్య, గూడూరి నవీన్ కుమార్, గణేష్, రాష్ట్ర సహయ కార్యదర్శి నెమలి సుభాష్ గౌడ్, బొల్లం శారద, శానబోయిన శ్రీనివాస్, ఎట్టబోయిన శ్రీను, షానబోయిన సుధాకర్ గౌడ్, వంగాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News