NLG: రైతు భరోసా సంబురాలను ఘనంగా నిర్వహించాలి.. డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్
రైతు భరోసా సంబురాలను(Raithu Bharosa Celebrations) జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు(DCC President) కేతావత్ శంకర్ నాయక్(Kethavath Shankar Naik) అన్నారు.
వెబ్ డెస్క్: రైతు భరోసా సంబురాలను(Raithu Bharosa Celebrations) జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు(DCC President) కేతావత్ శంకర్ నాయక్(Kethavath Shankar Naik) అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ జిల్లాల్లో సోమవారం సంబరాలు నిర్వహించాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ అన్నదాతలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా సంబరాలు నిర్వహించాలని తెలిపారు.
అలాగే రైతు రుణమాఫీ, ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్, రైతు భరోసా కార్యక్రమంలో వివరిస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని, బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించి, ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలని సూచించారు. అంతేగాక గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసి, ఆదాయ మార్గాలు కుంటుపడినా.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ రైతులకు భరోసా కల్పిస్తున్న అంశాలపై ప్రజలను, రైతులను కాంగ్రెస్ కేడర్ ను కలుపుకొని సంబరాలు నిర్వహించాలని చెప్పారు. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబురాల కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, NSUI నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.