రేపు చర్లపల్లి రైల్వే నూతన టెర్మినల్స్టేషన్ ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నూతనంగా నిర్మించిన చర్లపల్లి నూతన టెర్మినల్స్టేషన్ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నూతనంగా నిర్మించిన చర్లపల్లి నూతన టెర్మినల్స్టేషన్ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జీష్ణు దేవ్‌వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, స్థానిక ఎంపీ ఈటల రాజేందర్లు హాజరవుతారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై భారం తగ్గించడంలో భాగంగా చర్లపల్లి టెర్మినల్ ను రైల్వే శాఖ నిర్మించింది. దీనికి రూ.413 కోట్లు వెచ్చించారు. చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునిక వసతులతో నిర్మించారు. విమానాశ్రయాన్ని తలపించే తరహాలో దీనిని నిర్మించారు. ప్రయాణికులకు అన్ని రకాల వసతులు ఉండే విధంగా ఆధునాతనంగా దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడ 9 ఫ్లాట్ ఫాంలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లో ప్రస్తుతమున్న ఫ్లాట్ పాం ల సంఖ్య సరిపోకపోవడంతో ఒత్తిడి పెరుగుతుంది. రైళ్లు ఫ్లాట్‌ఫాంలు లేక ఆలస్యం అవుతున్నాయని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా దీనిని అభివృద్ధి చేశారు. రాబోయే రోజుల్లో ఇక్కడే అనేక రైళ్లు ఆగనున్నాయి. ఇక్కడి నుంచే ప్రారంభంకానున్నాయి.