మరోసారి YS షర్మిలకు షాకిచ్చిన తెలంగాణ పోలీసులు

వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ప్రజా ప్రస్థానం పాద‌యాత్రకు తెలంగాణ పోలీసులు మరోసారి అనుమ‌తిని నిరాక‌రించారు.

Update: 2022-12-09 07:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ప్రజా ప్రస్థానం పాద‌యాత్రకు తెలంగాణ పోలీసులు మరోసారి అనుమ‌తిని నిరాక‌రించారు. వ‌రంగ‌ల్ జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని హైద‌రాబాద్ త‌ర‌లించిన త‌రువాత రాజ‌కీయంగా పెద్ద చ‌ర్చ మొద‌లైంది. తెలంగాణ హైకోర్టు కూడా షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాద‌యాత్ర కోసం మ‌రోసారి ష‌ర్మిల పోలీసుల అనుమ‌తి కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోగా దానిని మళ్లీ పోలీసులు తిర‌స్కరించారు.

ఈ సందర్భంగా పాద‌యాత్రకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించ‌డంతో షర్మిల దీక్షకు సిద్ధమైంది. పోలీసులు అనుమతి నిరాకరించడంపై హైదరాబాద్‌లోని తన నివాసమైన లోటస్ పాండ్ వద్ద దీక్ష చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద వైఎస్సార్టీపీ పార్టీ నేతలు దీక్ష శిబిరాల ఏర్పాటు చేశారు. కనీసం మూడు రోజులు లేదా అనుమతి ఇచ్చే వరకు షర్మిల దీక్ష చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా షర్మిల నిరసన తెలిపనున్నారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అనంతరం నిరసన తెలపనున్నట్లు సమాచారం. ఇక, భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై షర్మిల మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉన్నది.

Also Read....

Himachal and Gujarat ఫలితాలపై Revanth Reddy కీలక వ్యాఖ్యలు 

Tags:    

Similar News