ఏపీని అడ్డుకోకుంటే మాకు నష్టం.. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ

ఆంధ్రప్రదేశ్ కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టిందని కేఆర్ఎంబీ చైర్మన్‌కు రాష్ట్ర నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు.

Update: 2023-10-05 14:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఏపీ అక్రమంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టిందని కేఆర్ఎంబీ చైర్మన్‌కు రాష్ట్ర నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఎన్జీటీ ఆదేశాలు దిక్కరించి ఏపీ పనులు కొనసాగిస్తోందని, కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలించే పనులు ఏపీ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. 59 టీఎంసీల నీరు తరలించేలా పనులు కొనసాగిస్తూ అంతరాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

పనులు కొనసాగితే తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం జరుగుతుందని అందువల్ల తక్షణమే స్పందించి ఏపీ చేపట్టిన పనులను నిలిపివేయాలని ఈఎన్సీ కోరారు. అయితే తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదాల పరిష్కార బాధ్యతలను బ్రిజేష్ ట్రిబ్యునల్ కే అప్పగిస్తూ నిన్న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది.


Similar News