సామెల్ వెరీ గుడ్...! బాగా పనిచేస్తున్నారు..!! ఎమ్మెల్యేను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వెరీ గుడ్..! మీ ప్రాంతంలో చాలా బాగా పని చేస్తున్నావ్..ఇలాగే ముందుకు సాగు..దీనికి మా సహకారం ఎప్పటికీ ఉంటుంది..అంటూ సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ను అభినందించారు.

Update: 2024-10-21 13:54 GMT

దిశ,తుంగతుర్తి: వెరీ గుడ్..! మీ ప్రాంతంలో చాలా బాగా పని చేస్తున్నావ్..ఇలాగే ముందుకు సాగు..దీనికి మా సహకారం ఎప్పటికీ ఉంటుంది..అంటూ సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ను అభినందించారు. సోమవారం ఎమ్మెల్యే హైదరాబాదులో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సామిల్ ను సీఎం సన్మానించారు. తుంగతుర్తి నియోజకవర్గం తొండ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు అట్టహాసంగా శంకుస్థాపన చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు,మోత్కూరులో జూనియర్ కళాశాల విద్యార్థులకు వసతి గృహం ఏర్పాటు,ఎండిపోయిన బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు రప్పించడం,తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ మల్లన్నగుట్ట వద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలు, తదితర వాటి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.


Similar News