ప్రతి మహిళ దీనిపై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

Update: 2024-10-21 14:06 GMT

దిశ,సూర్యాపేట టౌన్; ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం బెస్ట్ క్యాన్సర్ పై మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో.. చేపట్టిన 2కే రన్ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన ఉండాలని 35 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటువ్యాధి కాదని దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే దీనిని గుర్తించడంతో.. నివారించుకునే అవకాశం ఉందని కలెక్టర్ తేజస్ అన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొందరికి కాదని ఎవరికైనా రావచ్చు కనుక 35 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ విధిగా ప్రభుత్వ ఆసుపత్రిలో స్క్రీనింగ్ టెస్ట్, మోమోగ్రామ్ ఉచితంగా చేస్తారని కలెక్టర్ తెలిపారు. గతంలో కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు తరచుగా బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు. 1985 నుంచి అక్టోబర్ నెలలో నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మందుగా జరుగుతున్నారని బ్రెస్ట్ క్యాన్సర్ కు ఐదు రకాల చికిత్సలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. మెడికల్ కళాశాల నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పరుస్తూ ర్యాలీ నిర్వహించారు. కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్ బట్, సత్యనారాయణ, రమేష్, యశ్వంత్, ఈశ్వరమ్మ, రాకేష్, చంద్ర ,పావని, రూట్ మేరీ, సునీత ,భూలక్ష్మి ,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News