ఇదేందయ్యా ఇది..నివిుషాల్లో మారిన టికెట్ ధర అసలేం జరిగిందంటే..?

నల్లగొండ జిల్లా లోని ఆర్టీసీ డిపో ప్రయాణికులను నిలువునా దారి దోపిడీ.. టికెట్ రేట్ల విషయంలో చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.

Update: 2024-10-21 16:48 GMT

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా లోని ఆర్టీసీ డిపో ప్రయాణికులను నిలువునా దారి దోపిడీ.. టికెట్ రేట్ల విషయంలో చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే..ఈ రోజు ఉదయం హైదరాబాద్ వెల్దామని ఓ ప్రయాణికుడు హైదరాబాద్ కి టికెట్ తీసుకున్నాడు. టికెట్ ప్రయాణ చార్జీ ఒక్కరికి 250రూపాయలు వసూలు చేశారు. ఓ ప్రయాణికుడు ఎదురు తిరిగి ఏంటి ఇంత అన్యాయం.. నేను వారానికి ఒకసారి హైదారాబాద్ వెళ్తా.. అసలు చార్జీ 180 అని నిలదీశాడు. దీంతో ఆ యువకుడికి వెంటనే 180 రూపాయల టికెట్టు ఇవ్వడం జరిగింది. అంటే అడిగితే ఇలా.. అడగకుండా వుండే వారికి మాత్రం 250 వసూలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఇలా దోపిడీ చేస్తున్న ఆర్టీసీ డిపో నల్లగొండ వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విధంగా మిర్యాలగూడ లో టికెట్ కు అదనంగా110 రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వారు కూడా డిపో వారిని నిలదీయగా టికెట్ ధర తగ్గించినట్లు సమాచారం.

పండుగ సందర్భంగా టికెట్ ధర పెంచాం: డిపో మేనేజర్

దిశ ప్రతినిధి డిపో మేనేజర్ నల్లగొండ వారిని ఇదే విషయం అడగగా వారు దసరా పండుగ సందర్భంగా.. అదనంగా చార్జీలు పెంచడం జరిగిందన్నారు. తమ సిబ్బంది పొరపాటు వల్ల పండుగ చార్జీలు వసూలు చేశారని తెలియగానే మళ్ళీ పాత రేట్ల చార్జీల తోనే టికెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.


Similar News