TG Assembly: మూడు బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
మూడు కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ(Telangana Assembly)లో ఆమోదం లభించింది.
దిశ, వెబ్‌డెస్క్: మూడు కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ(Telangana Assembly)లో ఆమోదం లభించింది. స్పోర్ట్స్ వర్సిటీ(Sports Varsity), యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు(Universities Act), తెలంగాణ జీఎస్టీ(Telangana GST) సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక విధానంపై చర్చ కొనసాగుతోంది. అంతకుముందు విపక్షాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రజలకు వాస్తవాలు తెలియాలనే సభలో శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి దాటి అప్పులు చేయడం లేదని చెప్పారు. స్పీకర్ అనుమతితో ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో హరీశ్‌రావుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యదూరమైన మాటలతో ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వ లోపాలను ప్రజలకు తెలియజెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.