TG Assembly: ఆ అంశంపై చర్చకు తొందరేముంది?.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

టూరిజంపై చర్చకు తొందరేముందని బీఆర్ఎస్(BRS) నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు.

Update: 2024-12-17 11:32 GMT
TG Assembly: ఆ అంశంపై చర్చకు తొందరేముంది?.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టూరిజంపై చర్చకు తొందరేముందని బీఆర్ఎస్(BRS) నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటన(Lagacharla incident)పై చర్చకు రెండు రోజులుగా పట్టుబడుతున్నా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని అన్నారు. సభా నియమాలపై నీతులు చెబుతూ ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందని విమర్శించారు. పాలకపక్షం ప్లకార్డులు లోనికి తెస్తే స్పీకర్ ఎలా అనుమతించారని ప్రశ్నించారు.

నిరసనల మధ్య బిల్లులు ఆమోదించుకున్నారని సెటైర్ వేశారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కునే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు టూరిజంపై చర్చకు తొందరేముందని అడిగారు. లగచర్ల రైతులు జైల్లో మగ్గుతుంటే సీఎం, మంత్రులు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. రైతులు కన్నీరు పెడుతుంటే సీఎం మంత్రులు జల్సాలో మునిగి తేలుతున్నారని కీలక ఆరోపణలు చేశారు. లగచర్ల ఘటన విషయంలో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.

Tags:    

Similar News