Marshals in Assembly: గొడవ చేస్తే బయటికే! అసెంబ్లీ లాబీలో పెద్ద ఎత్తున మార్షల్స్!

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ ఆవరణలో భారీగా మార్షల్స్‌ కనబడుతున్నారు.

Update: 2024-12-17 11:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ ఆవరణలో (Marshals in Assembly) భారీగా మార్షల్స్‌ కనబడుతున్నారు. ఏదైనా గొడవ జరిగితే స్పీకర్‌ అనుమతితో మార్షల్స్‌ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బయటకు తీసుకెళ్తారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భారీగా మార్షల్స్‌ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున్న ఉన్న మార్షల్స్‌ను విపక్ష నేతలు, సభ్యులు చూసి ఆశ్చర్యపోయారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో మార్షల్స్‌ను మోహరించిన దాఖలాలు లేవని,(BRS) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే లక్ష్యంగా మార్షల్స్‌‌ని ఏర్పాటు చేసినట్లు విపక్ష నేతలు చెబుతున్నారు. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం భయపడుతుందని సీనియర్ శాసన సభ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా (assembly lobby) అసెంబ్లీ లాబీలో మార్షల్స్ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News