KTR: రాజకీయ సన్యాసానికి సిద్ధం.. కేటీఆర్ సంచలన సవాల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన సవాల్ చేశారు.

Update: 2024-12-17 12:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) సంచలన సవాల్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వందశాతం రుణమాఫీ(Runa Mafi) అయితే రాజకీయ సన్యాసానికి సిద్ధమని ఇప్పటికే సవాల్ చేశాను.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని మరోసారి ప్రకటించారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని, లగచర్ల రైతులను అరెస్ట్ చేసి 35 రోజులైందని గుర్తుచేశారు.

ఇంకెన్నాళ్లు వేధిస్తారని మండిపడ్డారు. ఇప్పటివరకు రైతు రుణమాఫీ రూ.12 వేల కోట్లకు మించి కాలేదని అన్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన రైతులు, యువత, మహిళలు కూడా బాధపడుతున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ఆరు గ్యారంటీల విషయం తర్వాత.. ఉన్న పథకాలు కూడా సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందాన్నే తట్టుకోలేని రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరమా? అని అన్నారు.

Tags:    

Similar News