KTR : రేవంత్ రెడ్డి పాలనపై కేటీఆర్ విసుర్లు

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎక్స్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.

Update: 2024-12-17 11:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ఎక్స్ వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. లగచర్ల రైతులపై దాడిని గుర్తు చేస్తూ ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతుల మీద టెర్రరిజం..మరోవైపు అసెంబ్లీలో టూరిజం మీద చర్చలు..కాంగ్రెస్ పాలనా ప్రాధాన్యత అద్భుతం అంటూ కేటీఆర్ పోస్టు చేశారు.

ఆ వెంటనే మరో పోస్టులో హైదరాబాద్ ఓఆర్ ఆర్ పై 23కిలోమీటర్ల మేర నిర్మించిన ఇండియాలోని మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ తొలగింపును తప్పుబడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో పోస్టు చేశారు. ఇంతకంటే మూర్ఖమైన ప్రభుత్వం దేశంలో ఉందా? అని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. 

Tags:    

Similar News