PFI దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తం

పీఎఫ్‌ఐ కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాల కార్యకర్తలపై దాడులు

Update: 2022-10-15 05:36 GMT
PFI దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పీఎఫ్‌ఐ కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాల కార్యకర్తలపై దాడులు చేసేందుకు ఇప్పటికే పీఎఫ్‌ఐ కుట్ర చేసిందని గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణలోనూ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థలపై నిఘా ఉంచాలని ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో అంతర్గత కల్లోలం సృష్టించడమే ధ్యేయంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఆగడాలకు కేంద్రం కళ్లెం వేసే ప్రయత్నం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఆ సంస్థ నాయకులు, కార్యకర్తలపై ప్రత్యేక నిఘా ఉంచింది.

Tags:    

Similar News