సైబర్ నేరాలకు భారీగా రిక్రూట్‌మెంట్స్.. నిందితుల అరెస్ట్

సైబర్ నేరాలకు మోసాలకు అంతే లేకుండా పోతుంది. ..

Update: 2025-03-14 16:45 GMT
సైబర్ నేరాలకు భారీగా రిక్రూట్‌మెంట్స్.. నిందితుల అరెస్ట్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: సైబర్ నేరాలకు మోసాలకు అంతే లేకుండా పోతుంది. నిత్యం ఏదో ఓక సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడటం పరిపాటి అయింది. సైబర్ నేరగాళ్లకు డార్క వెబ్ సైట్ ద్వారా వ్యక్తీగత సమాచారం అందుతుందని తెలుస్తున్నది. వాట్సప్, ఇన్ స్టా, ఫేస్బుక్ వంటీ సోషల్ మీడియా మాద్యమాల ద్వారా కూడా సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగులను టార్గెట్ గా చేస్తూ జాబ్ ఆఫర్ పేరుతో ఆర్థిక లావాదేవిలు అధికంగా జరిపే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇందుకు వారికి వేతనాలు కూడా ఇస్తున్నారు. ఫ్రీ గిఫ్ట్ ల పేరుతో, అపదలో ఉన్నాం అని ఆదుకొవాలని వాట్సప్ మేసేజ్ ద్వారా డబ్బులు అడగటం వంటీవి, జాబ్ ఆఫర్ల పేరుతో, మత ప్రార్థనల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.

కాల్ సెంటర్ జాబ్ నెలకు రూ.30వేల వేతనం.. రోజువారి 30కాల్స్ టార్గెట్

ఇటీవల కాలంలో సైబర్ నేరాలకు పాల్పడుతన్నావారు ఏకంగా కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. అటువంటీ సంస్థను టీజీసీఎస్బీ అధికారులు హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇటీవల గుర్తించారు. లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి నిరుద్యోగులను టార్గెట్ గా చేస్తూ రిక్రూట్ మెంట్ చేస్తున్నారు. కాల్ సెంటర్ లో పని చేయడానికి రూ.30వేలు జీతంగా ఇస్తు్న్నారు. ఒక్కో ఎంప్లాయికి రోజు 30మంది కస్టమర్లకి కాల్స్ చేయాలని టార్గెట్ ఇస్తున్నారు. రిక్రూట్ అయిన వారికి సైబర్ మోసాలపై శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగులను హస్టల్ లలో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తూ హస్టల్ కు ఆఫీస్కు రవాణా సౌకర్యాలు కూడా వారే ఏర్పాటు చేస్తు్న్నారు. కార్పోరెట్ స్టైల్ లో ఆఫీస్ నిర్వహణ చేస్తూ ఎవరికి అనుమానం కలగకుండా సైబర్ క్రైమ్ పాల్పడుతున్నారు.

వాట్సప్ మేసేజ్ లో డబ్బులు పంపమని సైబర్ మెసాలు

ఇటీవల కాలంలో సైబర్ నేరాగాళ్లు వివిధ ప్లాట్ ఫామ్లను ఎంచుకుంటున్నారు. టెలిగ్రామ్, వాట్సప్ , ఫేస్బుక్ ద్వారా మేసేజ్ పంపుతూ నేరాలకు పాల్పడుతున్నారు. బాధితులను ఎంచుకుని వారి వివరాలు సేకరించి నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సప్ డిపి ల ద్వారా వారు ఏం చేస్తారు. వారి ప్రోఫైల్ ఎంటని నిర్ధారించుకుని సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారు. హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ డిప్యూటీ డిఈవో వాట్సప్ డిపికి తన ప్రెయర్ చేసే ఫోటో డిపిగా పెట్టుకుంది. ఆమెకు ఫాదర్ ఫిలిప్స్ పేరుతో కాల్ చేసి అన్లైన్ ద్వారా ప్రెయర్ చేస్తు్న్నాము ఒక మేసేజ్ చేశాము దానిన ఓపెన్ చేయాల్సిందిగా తెలిపాడు. అనుమానస్పదంగా అనిపించడంతో కాల్ కట్ చేసింది. అప్పటికే ఆమె వాట్సప్ హ్యక్ చేసి కాంటాక్టులో ఉన్న అందరికి నాకు ఒక చిన్న సహయం చేయాలని డబ్బులు పంపమని మేసేజ్ లు పంపించారు. కొంత మందితో సైబర్ నేరగాళ్ళు చాటింగ్ చేసి వారికి చెందిన ఫోన్ పే నెంబర్ కు డబ్బులు పంపాల్సిందిగా తెలిపారు. బాధితురాలు అప్రమత్తంగా కావడంతో అందరికి తన వాట్సప్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని ఎవరూ డబ్బులు పంపవద్దంటూ సమాచారం ఇచ్చింది. మరోక ఘటనలో జాబ్ ఆఫర్ పేరుతో వాట్సప్ మేసేజ్ రాగా హైదరాబాద్ కు చెందిన ముస్లీం యువతి రూ.2లక్షల రూపాయల పోగుట్టుకుంది. వాట్సప్ డిపీ ద్వారా ముస్లీం మహిళగా గుర్తించి విదేశాలలో మంచి జాబ్ ఆఫర్ ఉందని మంచి జీతం ఇస్తారని మోసానికి పాల్పడ్డారు. ఉర్ధూలో మాట్లాడంతో కొంత నమ్మకం కలిగిందని నిజంగా జాబ్ ఆఫర్ అని విడతల వారిగా అన్లైన్ లో డబ్బులు పంపినట్లు బాధిత మహిళ చెప్పుకొచ్చారు.

హైదారాబాద్ లోని ఒక కంపెనీకి చెందిన అకౌంట్స్ ఆఫీసర్ కు అదే కంపెనీ సీఎండి ప్రోఫైల్ పిక్ తో వాట్సప్ మేసేజ్ ద్వారా కొత్త ప్రాజెక్టు కోసం రూ.1.95కోట్లు ట్రాన్సఫర్ చేయమని మేసేజ్ చేశారు. సీఎండి ప్రోఫైల్ ఫోటో ఉండటంతో ఆకౌంట్స్ ఆఫీసర్ ఆ మొత్తా్న్ని వాట్సప్ మేసేజ్ నుంచి వచ్చిన అకౌంట్ కి ట్సాన్సఫర్ చేశాడు. కంపెనీ సీఎండి కి మనీ ట్రాన్సఫర్ గురించి నోటిఫికేషన్ మేసేజ్ రావడంతో అకౌంట్స్ ఆఫీసర్ ను విచారించగా మోసపోయినట్లు భావించారు. వాట్సప్ మేసేజ్ ఆధారంగా బదిలీ జరిగిందని తెలుసుకున్న సీఎండి , తాను ఎలాంటి మేసేజ్ పంపలేదని సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా డబ్బును హోల్డ్ చేశారు.

మయన్మార్ స్కామ్ లో 24 మంది తెలంగాణ బాధితులు

మయన్మార్‌లోని మైవాడిలో సైబర్ స్కామ్ కాంపౌండ్స్‌లో చిక్కుకున్న 540 మంది భారతీయులను గత రెండు రోజుల క్రీతం స్వదేశానికి రప్పించారు. వారిలో తెలంగాణకు చెందిన 24మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామంటూ నిరుద్యోగులను మోసానికి పాల్పడ్డట్టు బాధితులు చెప్పుకోచ్చారు. స్థానికంగా సైబర్ నేరాగాళ్ల ఎజెంట్లు, మధ్యవర్తులు ఉన్నారని వారి ద్వారా ట్రాప్ చేసినట్లు బాధితులు తెలుపుతున్నారు. అక్రమ రవాణా చేస్తున్న వారిని గుర్తించిన వెంటనే టీజీసీఎస్బీ ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. విదేశాల్లో మోసపూరిత ఉద్యోగ ఆఫర్ల పట్ల జాగ్రత్త వహించాలని బాధితులు సూచిస్తున్నారు.

రాజస్థాన్ లో సైబర్ స్థావరం గుట్టు రట్టు చేసిన ఖమ్మం వాసులు

ఉద్యోగాల పేరుతో రాజస్థాన్లోని ఓ ప్రాంతానికి తీసుకువెళ్ళినట్లు ఖమ్మం కు చెందిన కొంత మందిని తీసుకెళ్లారు. అక్కడ తమకు సైబర్ నేరాల పట్ల శిక్షణ ఇస్తున్న సమయంలో మోసానికి గుర్తించినట్లు గుర్తించారు.. ఇది మా పని కదాని ప్రశ్నించిన ఓ యువతి హత్య చేస్తామని బెదిరిపులకు పాల్పడ్డారు. తాము చెప్పిన విధంగా చేయాలని లేదంటే ఇక్కడ నుంచి వెళ్లరంటే భయ పెట్టారు. చాక చక్యంగా తప్పించుకుని ఖమ్మం చేరుకుని వారి పై ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టయింది.

ఉద్యోగ ఆఫర్లతో అప్రమత్తం..

ఉద్యోగ ఆఫర్‌లలో, కనీస అర్హతలతో అధిక జీతాలు ఇస్తామని హామీ ఇచ్చే సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచిస్తుంది.

విదేశాలలో కాని, ఇతర రాష్ర్టాలలో ఎక్కడైనా ఉద్యోగ లభించిన వెంటనే ముందుగా ఆ కంపెనీ వివరాలు తెలుసుకొవాలని సూచిస్తున్నారు.

శిక్షణ సమయంలో ఏఏ అంశాలపై శిక్షణ ఇస్తున్నురో గుర్తించాలని మోసపూరితమైన విషయాలపై శిక్షణ ఇచ్చినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని తెలుపుతున్నారు.

విదేశాలలో ఉద్యోగ ఆఫర్ వచ్చినట్లయితే * విదేశాలలో ఉద్యోగ ఆఫర్ వచ్చినట్లయితే https://emigrate.gov.in ద్వారా విదేశాంగ మంత్రిత్వ శాఖ

(ఎంఈఏ) నిర్ధేశించిన సూచనలు పాటిస్తూ విదేశాలకు వెళ్లాలని తెలుపుతన్నారు.

విదేశీ ప్రయాణానికి ముందు కంపెనీ నుంచి వ్రాతపూర్వక ఒప్పందం పొంది ఉండాలి.


Similar News