సీఎం స్పీచ్‌తో డొల్లతనం బయటపడింది.. బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్
గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన అసెంబ్లీ ప్రసంగం మొత్తం ఆయన డొల్లతనాన్ని బయటపెట్టిందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన అసెంబ్లీ ప్రసంగం మొత్తం ఆయన డొల్లతనాన్ని బయటపెట్టిందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు. ట్రిపుల్ఆర్ఉత్తర బాగం, డందుమల్కాపూర్ టెక్స్ టైల్ పార్కు, మామునూరు కొత్త ఎయిర్ పోర్టు కు నిధులు ఇచ్చింది కేంద్రం అయితే సీఎం రేవంత్దానిని కూడా అంగీకరించకుండా బీజేపీ ఇతర ప్రతిపక్షాలపై సీఏం రేవంత్దుమ్మెత్తి పోశారన్నారు. రేవంత్తీరు.. డిల్లీలో తమ ప్రధాని మోడీతో దోస్తీ.. ఇక్కడ మాత్రం రాష్ట్ర బీజేపీతో కుస్తీ అన్న తీరుగా ఉందన్నారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతోందని, ఆ విషయాన్ని కూడా సీఎం ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. అటు ఆర్టీసీకి బకాయిలు చెల్లించలేదని, కానీ చెల్లించామని సీఎం తన ప్రసంగంలో అబద్ధం చెప్పారని బీజెపీ ఎంఎల్ఏ పాల్వాయి హరీష్‌బాబు ఆరోపించారు. అదే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే సీఎంకు ఎక్కడ లేని ఆనందం కలుగుతోందని, ఒకరు తానా అంటే మరొకరు తందానా అన్నట్టు తయారయ్యారని మండిపడ్డారు. వారి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం నేడు బయట పడిందన్నారు.
మరో బీజేపీ ఎంఎల్ఏ పాయల్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. 317 జీఓ వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై మాట్లాడటం లేదన్నారు. దీనిని బట్టిచూస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ నైజం ప్రస్తుత అసెంబ్లీలో బయట పడిందన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రాష్ట్రానికి అనేక అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు తెచ్చుకుంటున్న విషయాన్ని సీఎం రేవంత్అంగీకరించినట్లేనన్నారు.