లిక్కర్ టెండర్లకు స్పందన కరువు

తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త లిక్కర్ బ్రాండ్స్ ను ఆహ్వానించిన అప్లికేషన్ల పట్ల కొత్త కంపెనీలు సుముఖత చూపనట్లుగా తెలుస్తున్నది.

Update: 2025-03-17 17:21 GMT
లిక్కర్ టెండర్లకు స్పందన కరువు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త లిక్కర్ బ్రాండ్స్ ను ఆహ్వానించిన అప్లికేషన్ల పట్ల కొత్త కంపెనీలు సుముఖత చూపనట్లుగా తెలుస్తున్నది. కొత్త మద్యం బ్రాండ్ల రుచి చుద్దాం అని ఎదురు చూస్తున్న మందు బాబులకు నూతన లిక్కర్ అందని ద్రాక్షల మారింది. ఈ నెల 15వ తేది వరకు నూతన కంపెనీ నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తు్న్నట్లు అధికారులు ఫిబ్రవరి 23 తేదిన ప్రకటన చేశారు. గడువు ముగిసి మూడు రోజులు కావడంతో మరో పది రోజుల పాటు గడుపు పెంచుతున్నట్లు టీజీబీసీఎల్ అధికారుల నుంచి సమాచారం అందుతుంది. అశించిన స్థాయిలో కంపెనీ నుంచి అప్లికేషన్స్ రాలేదని తెలుస్తున్నది. రాష్ర్టంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీల నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తున్న టీజీబీసీఎల్ ప్రకటనలు చేసిన గడువు ముగిసి మూడు రోజులు అవుతున్న ఎన్ని కంపెనీలు అప్లికేషన్స్ పెట్టుకున్నాయో అధికారిక సమచారం మాత్రం టీజీబీసీఎల్ నుంచి వెలువడలేదు.

జనవరి నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త కంపెనీలకు ఆహ్వనించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రక్రియ పూర్తి కావాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారిచేశారు. పారదర్శకంగా కొత్తగా కంపెనీల ఎంపిక జరగాలని ఆదేశాలు జారి చేశారు. కొత్త కంపెనీలకు అనుమతులిచ్చే విషయంలో అధికారులు ప్రోసిజర్ ప్రకారం జరగాలన్నారు. సీఎం ఆదేశాలిచ్చిన నెల రోజుల తర్వాత తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) నుంచి నూతన కంపెనీలను ఆహ్వనిస్తూ ప్రకటనలు చేశారు. అఖరి తేది మార్చి 15 వరకు కేవలం 78 బ్రాండ్ల లిక్కర్, బీర్ల కు మాత్రమే అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తున్నది. తెలంగాణ ఎక్సయిజ్ శాఖ ప్రస్తుతం వేయ్యికి పైగా బ్రాండ్లను సరఫరా చేస్తుంది. ఆ విధంగా చూస్తే కంపెనీలు ఆసక్తీ చూపనట్లుగా తెలుస్తున్నది. నూతన కంపెనీల నుంచి అప్లికేషన్స్ స్వీకరించే విషయంలో ఎక్సయిజ్ శాఖ అధికారులు కొంత అశ్రద్ద వహించినట్లే తెలుస్తుంది. గత సంవత్సరంలో రూ.29,690కోట్ల రూపాయలు ఎక్సయిజ్ శాఖ నుంచి రాష్ర్ట ఖాజానాకు ఆదాయం సమకూరింది. ప్రస్తుత సంవత్సరంలో ఈ లెక్కలను అధిగమిస్తారా అనే సందేహాలు నెలకోన్నాయి. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ర్టంలో ఎక్సయిజ్ శాఖ ఆదాయం తగ్గితే ప్రభుత్వ పథకాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.

నిబంధనలు వల్ల కంపెనీల వెనకడుగు.....

తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) నూతన కంపెనీల నుంచి అప్లికేషన్ తీసుకునే క్రమంలో రాష్ర్ట ప్రభుత్వ అదేశాల మేరకు నిబంధనలు కొంచెం కఠినతరం చెసినట్లుగా తెలంగాణ ఎక్సయిజ్ అధికారులు తెలుపుతున్నారు. టీజీబీసీఎల్ లో రిజిస్టర్ కానీ కొత్త కంపెనీలకు మాత్రం అనుమతి ఇవ్వనున్నారు. ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యత ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా వివరాలు తెలపాలని సూచించారు. మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తులో జతపరచాలని సూచించారు. ఈ నిబంధనల మేరకు కొన్ని కంపెనీలు వెనుకడుగు వేసినట్లు తెలుస్తున్నది. గతంలో కేవలం లక్ష రూపాయల డిపాజట్ తో అప్లికేషన్స్ స్వీకరిచేవారని లిక్కర్ సరఫరా సంస్ధలు తెలుపుతున్నాయి. బీర్లలలో ఆల్కహల్ శాతం, బీరు ధర, ఏ రాష్ర్టాలలో సరఫరా జరుగుతుంది అనే అంశాలు పరిగణలోకి తీసుకుని అనుమతులు మంజూరు చేసేవారని సంస్థలు తెలుపుతున్నాయి. నాణ్యత ప్రమాణాల సర్టిఫికేట్స్ , ఆరోపణలు లేని దృవీకరణ పత్రాలు అంటు నిబంధనలు కఠినతరం చేశారని సంస్థలు చెప్పుకొస్తున్నాయి.

నూతన కంపెనీలు రాక పోతే యూబీ కంపెనీదే గుత్తాధిపత్యం

రాష్ర్టంలో నూతన కంపెనీల ఆహ్వానించాడానికి ప్రధాన కారణం యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ తీసుకున్న నిర్ణయం ప్రధాన కారణం అని చెప్పవచ్చు. తెలంగాణలో బీర్ల తయారీ నిలిపివేస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్సెంజ్ కి జనవరి 8వ తేదిన లేఖ రాసింది. 33శాతం ధరలను పెంచాలని తెలిపింది. యూబీ నిబంధనలు ఖాతారు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి నూతన కంపెనీల ద్వారా మద్యం సరఫరా చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని ఎక్సయిజ్ అధికారులను ఆదేశించారు. యూబీ కంపెనీ దిగి వచ్చి తెలంగాణ బీర్ల సరఫరా చేస్తామని తెలపడంతో మళ్ళీ రాష్ర్టంలో యూబీ కంపెనీ చెందిన బ్రాండ్ల బీర్లు తయారీ సరఫరా ప్రారంభం అయ్యాయి. ఇటీవల 15శాతం ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నూతన కంపెనీల అప్లికేషన్ల రాకపోతే రాష్ర్టంలో బీర్ల సరఫరా లో 72శాతం సరఫరా చేస్తున్న యూబీ కంపెనీ గుత్తాధిపత్యం చెలాయించే అవకాశం ఉందని తెలుస్తున్నది. నూతన కంపెనీల రాకతో లీక్కర్ , బీర్ల ధరలలో తగ్గుదల ఉంటుదని మద్యం ప్రియలు ఆశ పడ్డారు. కాని ఎక్సయిజ్ అధికారుల తీరుతో ఆశ అడియాశలు అయినట్లుగా కనిపిస్తుంది. రాష్ర్టంలో మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు దంచికోడుతున్నాయి. మద్యం ప్రియలు బీర్ల పై పరుగులు పెడుతున్నారు. అధిక సరఫరా వాటా కలిగిన యూబీ కంపెనీ సరఫరా లో అంతరాయం ఏర్పడితే ఎక్సయిజ్ శాఖ అధాయం పై ప్రభావం పడేలా ఉందని ఆర్ధికవేత్తలు తెలుపుతున్నారు. ఈ విధంగా జరిగితే భవిష్యత్తులో యూబీ కంపెనీ గుత్తాధిపత్యానికి రాష్ర్ట ప్రభుత్వం ఓకే చెప్పాల్సి వస్తుందని తెలుపుతున్నారు.


Similar News