అన్నదాతల సంక్షేమ కోసం అనేక పథకాలు : మంత్రి తుమ్మల
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎప్పడు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమ అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎప్పడు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. సోమవారం శాసనమండలిలో సభ్యులు జీవన్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, బలమూరి వెంకట్అడిగిన ప్రశ్నలు జవాబిచ్చారు. రాష్ర్టంలో రుణమాపీ నాలుగు దఫాలుగా 25,35,964 మంది రైతులకు రూ. 20, 616 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2024 లో 69.82 లక్షల మంది రైతులకు రూ. 7625. 14 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. 2024–25 యాసంగి కాలం నుంచి పెట్టుబడి సహాయం ఎకరానికి సంవత్సరానికి రూ. 10 వేల నుంచి రూ. 12 వేలుకు పెంచినట్లు పేర్కొన్నారు. ఈనెల 15న నాటికి 52.09 లక్షల మంది రైతులకు రూ. 4162. 21 కోట్లు వారి ఖాతాలో జమ చేసినట్లు వెల్లడించారు.
అదే విధంగా ఈఆర్ధిక సంవత్సరంలో 29,14,692 మంది రైతులకు విద్యుచ్చక్తి కోసం రూ. 9800. 07 కోట్లు సబ్సిడీ అందజేసినట్లు వివరించారు. ఖరీస్సీజన్లో 4,48,939 మంది రైతుల నుంచి క్వింటాల్ రూ. 500 బోనస్‌తో 23.93 లక్షల మెట్రిక్‌టన్నుల సన్నం రకం కోనుగోలు చేశామన్నారు. అందుకోసం ప్రభుత్వం రూ. 1199 కోట్లు ఖర్చు చేసిందన్నారు. బ్యాంకర్లుకు సమర్పించిన డేటాలో బ్యాంక్సంబంధిత కొన్ని తప్పులు జరిగాయని, అవి ఆధార్చెల్లుబాటు కానీ ఆధార్‌తో ఖాతాలు, రుణ ఖాతా, ఆధార్ప్రకారం రుణం తీసుకున్న వారి పేర్లలో తేడాలు ఉన్నాయన్నారు. డూప్లికేట్రుణ ఖాతాలు, వివిధ రుణ ఖాతాల కోసం ఒకే కస్టమర్ఐడీ, మూసివేసిన ఖాతా నెంబర్ల కారణంగా కొంతమంది రుణమాఫీ విషయంలో జాప్యం జరిగిందన్నారు.