CM Revanth: వాళ్లు అలా పిలుస్తుంటే.. చాలా ఆనందంగా ఉంది

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు కిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేసీఆర్‌ను పరామర్శించిన రోజును గుర్తుచేసుకున్నారు.

Update: 2025-03-15 16:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదవశాత్తు కిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేసీఆర్‌ను పరామర్శించిన రోజును గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాటల్లోనే చూస్తే.. ‘కేసీఆర్‌ను ఆసుపత్రిలో పరామర్శించి వస్తుంటే.. అదే ఆసుపత్రిలో ఓ ఆడబిడ్డ నన్ను రేవంతన్నా అని పిలిచింది. వెంటనే వెళ్లి ఆమె సమస్యను పరిష్కరించా. ఇంత కన్నా నాకు ఇంకేం కావాలి’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం.. కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కంకణం కట్టుకున్నాం.. ఇదంతా చేస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ‘ఒకనాడు ఇందిరా గాంధీని అమ్మా అన్నారు.. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు.. ఇప్పుడు అన్నా అని నన్నూ పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు. జీవితంలో ఇంతకుమించి ఇంకేం కావాలని అన్నారు.

READ MORE ...

ముఖ్యమంతి పర్యటన వేళ ట్రాఫిక్ రూల్స్ ఇలా..


Tags:    

Similar News