Harish Rao : 4 ప్రభుత్వ ప్రభుత్వాలు సాధించిన సల్మాను అభినందించిన హరీష్ రావు

ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు(Govt Jobs) సాధించిన సిద్దిపేటకు చెందిన నిరపేద మహిళ సల్మాను అభినందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao).

Update: 2025-03-16 16:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు(Govt Jobs) సాధించిన సిద్దిపేటకు చెందిన నిరపేద మహిళ సల్మాను అభినందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao). ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మంచిగా చదివి నలుగురికి ఆదర్శంగా నిలవాలి అన్న మాటను సల్మా నిజం చేసిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భర్త మెకానిక్ అని, భర్త కష్టం చూసి కుటుంబ పరిస్థితి చూసి ఒక వైపు కుటుంబ బాధ్యత మరో వైపు ఎదో సాధించాలని తపనతో కష్టపడి చదివి, ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిందని సల్మా నేహాను హరీష్ రావు మెచ్చుకున్నారు.. నాలుగు ఉద్యోగాలు సాధించి ఎంతో మంది మధ్య తరగతి మహిళలకు, యువతి, యువకులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సల్మాను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్బంగా ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్బంగా సల్మా మాట్లాడుతూ.. గతంలో మేము కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళమని, అందువల్ల చదివేందుకు ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చేవని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు డబుల్ బెడ్ రూం మంజూరు చేయడం వలన ఆర్థికపరమైన స్థిరత్వం వచ్చిందని, దానితో నాకు చదువుకునేందుకు నాలో నాకే ఉత్సాహం వచ్చిందని బాధ్యత పెరిగింది ఏదో సాధించాలనే తపనతో నాలుగు ఉద్యోగాలు సాధించానని అన్నారు. గురుకుల టీచర్, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.

Tags:    

Similar News