ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే, జూన్ ల పరిస్థితేంటి రేవంత్..? కేఏ పాల్ సంచలన వీడియో

సీఎం రేవంత్ రెడ్డి 15 నెలల్లోనే ఫెయిల్ అవ్వడం బాధేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

Update: 2025-03-16 15:11 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 15 నెలల్లోనే ఫెయిల్ (Fail) అవ్వడం బాధేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja Shanthi Party President) కేఏ పాల్ (KA Paul) అన్నారు. హైద్రాబాద్ (Hyderabad) లో నీటి కొరత (Water Problem)పై ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మీడియాను ఎటాక్ చేయడం, పదేళ్లు నేనే సీఎం ఉంటానని చెప్పడం టీవీల్లో చూశానని తెలిపారు. మార్చి 15 కే హైద్రాబాద్ అమీర్ పేటలో (Ameer Peta) తాగడానికి మంచినీళ్లు లేక వాటర్ ట్యాంకులు తెప్పించుకుంటున్నామని, మరి ఏప్రిల్, మే, జూన్ ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయ్యి ఉండి సమ్మిట్ పెట్టాలి.. ఇన్‌వెస్ట్‌మెంట్స్ తేవాలి అన్న ధ్యానం లేదని విమర్శించారు. ఇప్పుడేదో భారత్ సమ్మిట్ (Bharath Summit) పెడతానని మాట్లాడుతున్నాడని, నువ్వు పెడితే ఎవరు వస్తారని ఎద్దేవా చేశారు.

అలాగే కాంగ్రెస్ (Congress) గెలిస్తే అప్పులు తీర్చి, రాష్ట్రాన్ని బాగు చేస్తుందని తాను వరంగల్ (Warangal) లో పోటీ చేయకుండా ఆగానని, కానీ రేవంత్ రెడ్డి బీజేపీని (BJP) గెలిపిస్తున్నాడని ఆరోపించారు. అలాగే రాహుల్ గాంధీకి  (Rahul Gandhi) మూటలు పంపిస్తున్నాడని అంటున్నారని, ఎప్పుడూ దోచుకోవడం.. దాచుకోవడం.. పంచడమేనా.. లేక ప్రజల మీద ధ్యానం ఉందా అని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మంచి నీటి సమస్యలు వస్తున్నాయని, విద్యా వైద్యం అసలు కనిపించడం లేదని, కేవలం 15 నెలల్లోనే రేవంత్ రెడ్డి ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అవ్వడం ఒక అన్నగా, అడ్వైజర్ గా భాదేస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డికి ఈ వీడియో చూడాలని కోరుకుంటూ.. రాష్ట్రాన్ని కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం అని కేఏ పాల్ నినదించారు.

READ MORE ...

Hyderabad : కార్లు, బైకులు కడుగుతున్నారా.. అయితే భారీ ఫైన్ తప్పదు



Similar News